ఉద్యోగ సంఘాల నేతలకు భద్రత పెంపు

పీఆర్సీ సాధన సమితి నేతలకు ప్రభుత్వం భద్రత కల్పించింది. వారి నివాసాల వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది

Update: 2022-02-09 07:29 GMT

పీఆర్సీ సాధన సమితి నేతలకు ప్రభుత్వం భద్రత కల్పించింది. వారి నివాసాల వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. ఇటీవల ప్రభుత్వంతో చర్చలు జరిపిన పీఆర్సీ సాధన సమితి నేతలు సమ్మెను విరమించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చర్చలను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏకపక్షంగా సమ్మెను విరమించి ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యమాన్ని తాకట్టు పెట్టాయని మండిపడుతున్నాయి.

ఇళ్లను ముట్టడించే...
అయితే ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ సాధన సమితి నేతల ఇళ్లను ముట్టడించే అవకాశముందని సమాచారం అందింది. దీంతో పోలీసులు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సచివాలయం ఉద్యోగాల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఇళ్ల వద్ద పోలీసులతో భద్రతను పెంచారు. నలుగురు జేఏసీ నేతలపై ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు భద్రతపరమైన చర్యలు తీసుకున్నారు.


Tags:    

Similar News