Ys Jagan : జగన్ కు జీఏడీ నుంచి లేఖ.. ఫర్నీచర్‌ను అప్పగించాల్సిందే
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రభుత్వం లేఖ రాసింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నీచర్, ఎలక్ట్రికల్ వస్తువులు వెంటనే తమకు అప్పగించాలని సాధారణ పరిపాలన శాఖ జగన్ కు రాసిన లేఖలో పేర్కొంది. వెంటనే ఆ ఫర్నీచర్ ను ప్రభుత్వానికి అప్పగించాలని జగన్ కు సాధారణ పరిపాలన శాఖ రాసిన లేఖలో పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో...
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం క్యాంప్ కార్యాలయాన్ని తాడేపల్లిలోని తన ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఆ కార్యాలయంలో ఫర్నీచర్ ను ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసినట్లు జీఏడీ గుర్తించింది. ప్రభుత్వ నిధులతో ఫర్నీచర్ సహా పలు వస్తువులను తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం కోసం కొనుగోలు చేశారని, ఇప్పుడు పదవి నుంచి దిగిపోయిన తర్వాత వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కోరింది.