డీబీటీ చెల్లింపులకు అనుమతివ్వని ఈసీ.. వైసీపీ vs టీడీపీ వార్ మళ్లీ
గత ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలను అమలు చేయడానికి అనుమతివ్వాలంటూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది
గత ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలను అమలు చేయడానికి అనుమతివ్వాలంటూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది. పెన్షన్ల తరహాలోనే డీబీటీ చెల్లింపులకు టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. గత ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలేనని, వీటీకి అనుమతివ్వాలని ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది.
ఎన్నికల కమిషన్ నుంచి...
అయితే ఎన్నికల కమిషన్ ఇంత వరకూ అనుమతివ్వలేదని ప్రభుత్వం చెబుతుంది. ఆన్ గోయింగ్ పథకాలను అమలు చేయడానికి టీడీపీకి ఉన్న అభ్యంతరాలేంటని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే ఎన్నికల సమయంలో డీబీటీ చెల్లింపుల ద్వారా పథకాలను అమలు చేస్తే అది ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినట్లే అవుతుందని టీడీపీ అంటోంది. మరి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది.