Andhra Pradesh : స్పీకర్ గా అయ్యన్న పేరు ఖరారు.. 24నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 24నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 24నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. తొలుత 19 తేదీ నుంచి ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల 24వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ సమావేశాలు మొత్తం మూడు రోజులు జరగనున్నాయి. మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. స్పీకర్ ఎన్నికతో పాటు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరుగుతుంది.
22 మంత్రివర్గ సమావేశం...
శాసనసభ స్పీకర్ గా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు పేరు ఖరారయింది. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి రోజు సమావేశాలకు ప్రొటెం స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం ఇస్తారు. ఈ నెల 22వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసైన్‌మెంట్ ల్యాండ్ చట్టం రద్దుకు ఆమోదంతో పాటు మరికొన్ని కీలక బిల్లులను ఆమోదించే అవకాశముంది.