ఒమిక్రాన్ ఎఫెక్ట్ ....జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారా...?
ఆంధ్రప్రదేశ్ లోనూ ఒమిక్రాన్ కేసు బయటపడటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈరోజు దీనిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేయనున్నారు.
ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇండియాలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు 38 వరకూ వెలుగు చూశాయి. ఆరు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ ఒమిక్రాన్ కేసు బయటపడటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.
నేడు సమీక్ష....
ఇప్పటికే మాస్క్ లు ధరించకపోతే జరిమానా, వాణిజ్య సంస్థలు మాస్క్ లు లేకుండా లోపలికి అనుమతిస్తే ఫైన్ లు వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కేసు బయటపడటంతో మరింత కఠినంగా వ్యవహరించాలని భావిస్తుంది. ఈరోజు దీనిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేయనున్నారు. విజయనగరం జిల్లాలో బయటపడన ఒమిక్రాన్ కేసు ఏపీ సర్కార్ ను భయపెడుతుంది. అయితే ఒమిక్రాన్ సోకిన వ్యక్తి హోం క్వారంటైన్ లోనే నెగిటివ్ రావడం కొంత ఊరట నిచ్చే అంశం. ఈరోజు జరిగే సమీక్ష సమావేశంలో జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.