Free Gas Cylender : మహిళలకు గుడ్ న్యూస్... నేటి నుంచి రెండో ఉచిత గ్యాస్ సిలిండర్స్ బుకింగ్స్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కొన్ని నెలల నుంచి అమలు చేస్తుంది.;

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కొన్ని నెలల నుంచి అమలు చేస్తుంది. మహిళలు పెద్దయెత్తున ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. దీపావళి పండగ రోజు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.ఇప్పటికే దాదాపు కోటికి పైగా సిలిండర్లను పంపిణీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే అర్హులైన వారికి ఏపీ ప్రభుత్వం తాజాగా అలెర్ట్ జారీ చేసింది. దీపం-2' పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ నేట ినుంచి బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెండో సిలిండర్ బుకింగ్ ప్రారంభం కానుంది.
ఇప్పటి వరకూ...
ఈ పథకం కింద ఇప్పటివరకు 99 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నారు. ఉచితంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తుండటంతో తమ గ్యాస్ ఏజెన్సీల వద్ద కేవైసీ చేయించుకుని మరీ బుక్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 1.55 కోట్ల మంది లబ్దిదారులు అర్హులుగా గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వం 2,684 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ముందుగానే విడుదల చేసింది. తాజాగా ఇటీవల శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ఉచిత గ్యాస్ పథకానికి నిధులను కేటాయించింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మరొక సిలిడర్ ను బుక్ చేసుకునేందుకు అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని లబ్దిదారులను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరింది.
ఏడాదికి మూడు విడతలుగా...
ఏడాదికి మూడు సార్లుఈ దీపం 2 పథకాన్ని అమలు చేస్తారు. తొలి సిలిండర్ బుక్ చేసుకోవడానికి అక్టోబరు 29వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకూ బుక్ చేసుకునే వీలుకల్పించారు. ప్రతి ఏడాది ఏప్రిల్1 తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకూ రెండో సిలిండర్, ఆగష్టు ఒకటో తేదీ నుంచి నవంబర్ ఒకటో తేదీ వరకూ మూడో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. తేదీలతో సంబంధం లేకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. తెలుపురంగు రేషన్ కార్డు, ఎల్.పి.జి కనెక్షన్ కలిగి ఉండటంతో పాటు ఆధార్ కార్డు ఉన్నవారంతా అర్హులే. ఉచిత సిలిండర్ అందకుంటే 1967 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి సమాచారాన్ని పొందవచ్చు