మున్సిపల్ కార్మికులతో చర్చలు విఫలం
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. బేసిక్ పే ఇవ్వడం కుదరదని సర్కార్ తేల్చి చెప్పడంతో మున్సిపల్ కార్మికులు తమ సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు. మున్సిపల్ కార్మికులకు బేసిక్ పే ఇస్తే అన్ని శాఖల వారూ అడుగుతారని మంత్రుల బృందం అభిప్రాయపడింది. ఆ ఒక్కటీ అడగొద్దని తెలిపింది.
సమ్మె చేస్తుండటంతో...
మున్సిపల్ కార్మికులు గతకొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్నారు. దీంతో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది. కాంట్రాక్టు కార్మికులతో చెత్తను శుభ్రం చేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కార్మికులు అడ్డుకుంటున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకోసమే మంత్రుల బృందం మున్సిపల్ కార్మికులకు చర్చలు పిలిచింది. అయితే చర్చలు విఫలమవ్వడంతో సమ్మె కొనసాగుతుంది.