నేడు తిరుమలకు గవర్నర్
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నేడు తిరుమలకు రానున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నేడు తిరుమలకు రానున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం గవర్నర్ హరిచందన్ తిరుమలకు రానున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత కొద్దిసేపు అతిధి గృహంలో విశ్రాంతి తీసుకుంటారు.
స్నాతకోత్సవంలో....
అనంతరం తిరుపతి చేరుకుంటారు. అక్కడ సాయంత్రం ఎన్జీరంగా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ హరిచందన్ ముఖ్యఅతిధిగా పాల్గొంటారు. రాత్రికి తిరిగి విజయవాడకు చేరుకుంటారు. గవర్నర్ పర్యటన సందర్భంగా పోలీసులు తిరుమల, తిరుపతిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.