గౌతమ్ అదానీతో భేటీ అయిన ఏపీ సీఎం జగన్

రాష్ట్రంలో పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలనూ వివరిస్తూ ఏపీ పెవిలియన్‌ ఏర్పాటు చేశారు.

Update: 2022-05-22 14:20 GMT

సీఎం జగన్ తో ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌ పాల్‌, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తదితరులు కూడా జగన్‌తో సమావేశమయ్యారు. సీఎంతో గౌతమ్‌ అదానీ వివిధ అంశాలపై చర్చించారు. సీఎం జగన్‌ ఆయనకు జ్ఞాపికను అందజేశారు. వరల్డ్ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్‌, హెల్త్‌ విభాగాధిపతి డాక్టర్‌ శ్యామ్‌ బిషేన్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఆరోగ్య రంగంపై చర్చించారు. అనంతరం డబ్ల్యూఈఎఫ్‌తో ఫ్లాట్‌ఫాం పార్టనర్‌షిప్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఏపీ పెవిలియన్ ప్రారంభించిన సీఎం జగన్ వరుసగా అనేకమంది వ్యాపార ప్రముఖులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలనూ వివరిస్తూ ఏపీ పెవిలియన్‌ ఏర్పాటు చేశారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరయ్యేందుకు సీఎం జగన్ సరికొత్తగా దర్శనమిచ్చారు. సూటుబూటు ధరించిన ఆయన మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఎంపీ మిథున్ రెడ్డి, అధికారులతో డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరుగుతున్న వేదిక వద్దకు తరలి వెళ్లారు.


Tags:    

Similar News