గ్రూపు -1 ఇంటర్వ్యూలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
గ్రూపు్ 1 అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మెయిన్ పరీక్ష వాల్యుయేషన్ లో అక్రమాలు జరిగాయని వారు పేర్కొన్నారు.
గ్రూపు్ 1 అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మెయిన్ పరీక్ష వాల్యుయేషన్ లో అక్రమాలు జరిగాయని వారు పేర్కొన్నారు. ఈరోజు నుంచి జరగనున్న ఇంటర్వ్యూలను నిలిపేయాలని కోరారు. అయితే దీనిపై వాదోపవాదాలు జరిగాయి. 2018లో విడుదల చేసిన గ్రూప్ -1 ద్వారా పరీక్షలు నిర్వహించి ఆన్సర్ పేపర్లను తొలుత డిజిటిల్ విధానంలో దిద్దారని, తర్వాత న్యాయస్థానం ఉత్తర్వులతో చేతితో దిద్దారన్నారు. డిజిటల్ విధానంలో దిద్దినప్పుడు 326 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హులుగా తేల్చారని, తర్వాత చేతితో దిద్దడంతో 202 మంది అనర్హులుగా తేల్చారన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో అనర్హులుగా తేల్చడం వెనక రాజకీయ దురుద్దేశ్యాలున్నాయని అభ్యర్థుల తరుపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. నచ్చిన వారిని ఎంపిక చేశారని ఆరోపించారు. అనర్హులతో వాల్యుయేషన్ చేయించారన్నారు.