గుడివాడ మినీ మహానాడు ఎప్పుడంటే?
గుడవాడ టీడీపీ మినీ మహానాడు వాయిదా పడింది. ఈ నెల 29వ తేదీన జరిగాల్సిన మినీమహానాడును భారీ వర్షాల కారణంగా వాయిదా వేశారు
గుడవాడ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు వాయిదా పడింది. ఈ నెల 29వ తేదీన జరిగాల్సిన మినీమహానాడును భారీ వర్షాల కారణంగా వాయిదా వేశారు. అయితే ఎప్పుడు జరుగుతుందన్నది తెలియరాలేదు. జులై 6వ తేదీ తర్వాత మినీ మహానాడును గుడివాడలో జరపాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా టీడీపీ నేతలకు కేంద్ర పార్టీ నాయకత్వం నుంచి ఆదేశాలు అందాయి.
సీమలో ముగిసిన తర్వాత...
వచ్చే నెల 6,7,8 తేదీల్లో రాయలసీమలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. జులై 6వ తేదీన మదనపల్లిలో మినీమహానాడు జరగనుంది. జులై 7న పీలేరు, జులై 8న నగరి, జీడీ నెల్లూరులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. దీని తర్వాత గుడివాడలో మినీ మహానాడును నిర్వహించాలని తేదీ ఇంకా ఖరారు కాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.