Kodali Nani : గుడివాడ వైసీపీలో ఏం జరుగుతోంది?
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి సొంత నియోజకవర్గంలో వైసీపీలో అసమ్మతి బయలుదేరింది
Kodali Nani :గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి సొంత నియోజకవర్గంలో వైసీపీలో అసమ్మతి బయలుదేరింది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. గుడివాడ ప్రధాన కూడళ్లలో వెలిసిన బ్యానర్లపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది.
హనుమంతరావుకే నంటూ...
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుండి పిలుపు వచ్చిందంటు వైసీపీ నేతలలో కొందరు చెబుతుండటంతో క్యాడర్ లో అయోమయం నెలకొంది. హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం తీవ్రం కావడంతో అసలు గుడివాడలో ఏం జరుగుతుందన్న చర్చ మొదలయింది. దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా హనుమంతరావుకు గుర్తింపు ఉంది.