Drone Summit : డ్రోన్ సమ్మిట్ సక్సెస్.. ఐదు గిన్నిస్ రికార్డులు

విజయవాడలో నిన్న రాత్రి జరిగిన డ్రోన్ సమ్మిట్ ను చూసి అతిథులే ఆశ్చర్యపోయారు

Update: 2024-10-23 01:51 GMT

andhra pradesh drone summit

విజయవాడలో నిన్న రాత్రి జరిగిన డ్రోన్ సమ్మిట్ ను చూసి అతిథులే ఆశ్చర్యపోయారు. 5,500 డ్రోన్లు చేసిన విన్యాసాలను చూసిన వారు అచ్చెరవు చెందారు. దీంతో పాటు ఐదు గిన్నీస్ రికార్డులను ఈ ప్రదర్శన సొంతం చేసుకుంది. డ్రోన్లతో అతిపెద్ద ప్లానెట్ ఫార్మేషన్, అతి పెద్ద ల్యాండ్ మార్క్, అతి పెద్ద విమానం రూపకల్పన, అతి పెద్ద భారత జెండా, అతి పెద్ద ఏరియల్ లోగో ఫార్మేషన్ భాగాల్లో గిన్నిస్ రికార్డులు లభించాయి. ఈ ప్రదర్శనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పున్నమి ఘాట్ కు వచ్చారు.

ఇన్వెస్టర్లు, ఇన్వెంటర్లు...
అమరావతిలో చేసిన ఈ డ్రోన్ సమ్మిట్ తన ప్రతిభను ప్రదర్శించింది. అనేక మంది డ్రోన్ కంపెనీలకు చెందిన ఇన్వెస్టర్లు, ఇన్వెంటర్లు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. గిన్నిస్ రికార్డులను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తీసుకున్నారు. భవిష్యత్ అంతా డ్రోన్లదే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్స్‌తో ఉత్సాహంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది వచ్చి ఈ డ్రోన్ల విన్యాసాలను చూశారు. ఆకాశంలో దూసుకుపోయి తమ కళ్లముందే వివిధ చిత్రాలను ఆవిష్కరించడం చూసి ఆశ్చర్యపోయారు. మారనున్న సాంకేతిక పరిజ్ఞానాకి దీనిని ముందడుగా భావిస్తున్నారు.


Tags:    

Similar News