కులమే మంత్రి పదవిని తెచ్చి పెట్టింది
గుమ్మనూరి జయరాం రాజకీయ నేపథ్యం కూడా టీడీపీ నుంచే ప్రారంభమయింది. టీడీపీ నుంచి జడ్పీటీసీగా గెలిచారు.
సామాజికవర్గమే ఈయనకు రెండోసారి పదవి దక్కేలా చేసింది. గుమ్మనూరి జయరాం రాజకీయ నేపథ్యం కూడా టీడీపీ నుంచే ప్రారంభమయింది. టీడీపీ నుంచి జడ్పీటీసీగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున ఆలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2011లో ఆయన వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో ఆలూరు నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. జగన్ తొలి మంత్రివర్గంలో ఆయన కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. అనేక ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు. ఆయన బోయ సామాజికవర్గానికి చెందిన వారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో బోయ సామాజికవర్గం వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడం ఈయనకు కలసి వచ్చింది. మరోసారి జగన్ రెన్యువల్ చేశారు. ఈసారి కూడా ఆయనకు కార్మిక శాఖ అప్పగించే అవకాశముంది.