నేడు ఎండలకు తోడు వడగాల్పులు

ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు వడగాల్పులు రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు తోడుకానున్నాయి;

Update: 2023-04-10 02:24 GMT
నేడు ఎండలకు తోడు వడగాల్పులు
  • whatsapp icon

రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు తోడుకానున్నాయి. వేసవి ఎండలకు వడగాల్పులు తోడుకానున్నాయి. సోమవారం ఇరవై ఏడు, మంగళవారం ముప్ఫయి రెండు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామ జిల్లాలో, మన్యంలో, కాకినాడలో , అనకాపల్లి, తూర్పుగోదావరి , ఏలూరు జిల్లాలోని పలు మండలాల్లో వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ అంబేద్కర్‌ సూచించారు.

నేడు 27 మండలాల్లో...
ఐఎండి అంచనాల ప్రకారం ఈరోజు రేపు 27, ఎల్లుండి 32 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే వడ దెబ్బ తగిలే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.


Tags:    

Similar News