కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా బాధ్యతలను స్వీకరించారు;

ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా బాధ్యతలను స్వీకరించారు. ఏపీ డీజీపీగా తన శక్తి మేరకు పనిచేస్తానని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై చర్యలుంటాయని డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం సృష్టించడం కోసం తాను పనిచేస్తానని తెలిపారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్...
ఆంధ్రప్రదేశ్ లో పోలీస్‌శాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని ముద్రవేశారని ఆయన అన్నారు. ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు చేశారని హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ టీం ఏర్పాటు చేశారన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, టెక్నాలజీ కొనసాగిస్తాం. కొత్త డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. పోలీసు అధికారులు కూడా చట్ట పరిధిలో పనిచేయాలని ఆయన సూచించారు.