Chandrababu : నేడు బెయిల్ పిటీషన్‌పై విచారణ

నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది;

Update: 2023-11-10 03:37 GMT
chandrababu naidu, tdp,  anticipatory bail, high court, andhrapradesh, chandrababu news

chandrababu naidu bail

  • whatsapp icon

నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు వేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే హైకోర్టు ఈ కేసులో అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 28వ తేదీ వరకూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

కీలక కేసులన్నీ...
అయితే ఈ కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు పిటీషన్ ను నేడు హైకోర్టులో విచారణ చేయనుంది. అలాగే దీంతో పాటు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ పై కూడా నేడు విచారణ జరగనుంది. దీంతో పాటు మాజీ మంత్రి నారాయణపై పెట్టిన అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటీషన్ పై కూడా నేడు విచారణ జరగనుంది. దీంతో ఈరోజు చాలా కీలక కేసులపై హైకోర్టులో విచారణ జరగనుంది.


Tags:    

Similar News