Breaking : చంద్రబాబు పిటీషన్‌ను విచారించే ధర్మాసనం ఖరారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిటీషన్ పై సుప్రీంకోర్టులో వచ్చే నెల 3వ తేదీన విచారణ జరగనుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిటీషన్ పై సుప్రీంకోర్టులో వచ్చే నెల 3వ తేదీన విచారణ జరగనుంది. అయితే ఈ విచరణ చేపట్టే ధర్మాసనం ఖరారయింది. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఎదుట చంద్రబాబు పిటీషన్ విచారణకు రానుంది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఈ నెల 3వ తేదీకి విచారణను వాయిదా వేసిన నేపథ్యంలో మరొక బెంచ్ కు మారుస్తానని తెలియజేశారు.
క్వాష్ పిటీషన్ ను...
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు క్వాష్ పిటీషన్ ఈ నెల 3న జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి తనపై నమోదయిన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాలంటూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.