ఆర్జీవీ బెయిల్ పై నేడు హైకోర్టులో

రాంగోపాల్‌వర్మ బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది

Update: 2024-12-10 03:11 GMT

రాంగోపాల్‌వర్మ బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్‌ కోసం వర్మ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సోషల్‌మీడియాలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేష్ లపై పెట్టిన పోస్టులపై ఆంధ్రప్రదేశ్ లో పలు కేసులు నమోదు అయ్యాయి. వారిపై అనుచిత పోస్టులు పెట్టారంటూ కొందరు చేసిన ఫిర్యాదుతో మద్దిపాడు పోలీస్ స్టేషన్ తో పాటు ఎనిమిది ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.

తనపై నమోదయిన కేసులు..
అయితే ఇటీవల తనపై నమోదయిన కేసులన్నీ క్వాష్ చేయాలని రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం వర్మపై చర్యలు తీసుకోవద్దని కోరుతూ పోలీసుల నుంచి కేసుల వివరాలను కోరింది. అయితే ఈరోజుతో ఆ గడువు పూర్తి కావడంతో ముందస్తు బెయిల్ పిటీషన్ పై కూడా నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News