Supreme Court : లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టులో నేడు విచారణ

తిరుమలలో లడ్డూ కల్తీపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఉదయం పదిన్నర గంటలకు ఈ విచారణ ప్రారంభమవుతుంది

Update: 2024-10-04 01:47 GMT

tirumala laddu adulteration 

తిరుమలలో లడ్డూ కల్తీపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఉదయం పదిన్నర గంటలకు ఈ విచారణ నేడు ప్రారంభమవుతుంది. జస్టిస్ విశ్వనాధన్, జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటీషన్లను విచారించనుంది. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ చేశారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటీషన్లు వేశారు.

సమయం కావాలని...
అయితే ఈ పిటీషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంకు అప్పగించాలా? లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వాలో తెలపాలని సొలిసిటర్ జనరల్ ను ధర్మాసనం కోరింది. ఈ నెల 3వ తేదీకి వాయిదా వేసింి. అయితే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమకు అభిప్రాయం తెలిపేందుకు కొంత సమయం కావాలని కోరడంతో నేటికి కేసు విచారణ వాయిదా పడింది. ఈరోజు 10.30 గంటలకు ఈ కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది.


Tags:    

Similar News