నెల్లూరును వణికిస్తున్న వర్షం
నెల్లూరు జిల్లాలో భారీ వర్షం మొదలయింది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు
నెల్లూరు జిల్లాలో భారీ వర్షం మొదలయింది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకూ కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన నెల్లూరు జిల్లా మరోసారి భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొద్దిసేపటి నుంచి నెల్లూరులో వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు.
జాతీయ రహదారిపైకి....
మరోవైపు నదులు పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్లు ప్రాంతాలు జలమయ్యాయి. గూడూరు, వెంకటగిరి, కోవూరు నియోజకవర్గాల్లో అనేక గ్రామాలు జలమయమయ్యాయి. కండలేరు నుంచి నీటిని విడుదల చేయడంతో పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కండలేరు డ్యామ్ నిండుకుండలా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గూడూరు జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సోమశిల జలాశయం కూడా నిండుకుండలా మారింది.