అసైన్డ్ భూముల కేసు నవంబరు 1కి వాయిదా

అసైన్డ్ భూముల కేసును తిరిగి తెరవాలని వేసిన పిటీషన్ హైకోర్టు నవంబరు 1వ తేదీకి వాయిదా వేసింది

Update: 2023-10-16 05:52 GMT

అసైన్డ్ భూముల కేసును తిరిగి తెరవాలని వేసిన పిటీషన్ హైకోర్టు నవంబరు 1వ తేదీకి వాయిదా వేసింది. సీఐడీ మరోసారి ఈ పిటీషన్లను విచారించాలని కోరింది. దీనిని వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అమరావతి అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు, నారాయణ క్వాష్ పిటీషన్లపై గతంలో ఏపీ హైకోర్టు విచారించి తీర్పును రిజర్వ్ చేసింది.

రీ ఓపెన్ చేయాలంటూ...
అయితే తమ వద్ద అదనపు ఆధారాలున్నాయని, ఈ కేసును రీ ఓపెన్ చేయాలంటూ సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన హైకోర్టు నవంబరు 1వ తేదీకి వాయిదా వేసింది. అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి మాజీ మంత్రి నారాయణతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారన్న ఆరోపణలున్నాయి.


Tags:    

Similar News