Breaking : జీవో నెంబరు 1ను కొట్టేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుడల చేసిన జీవో నెంబరు 1ను హైకోర్టు కొట్టివేసింది.;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుడల చేసిన జీవో నెంబరు 1ను హైకోర్టు కొట్టివేసింది. ప్రాధమిక హక్కుల విఘాతంగా ఈ జీవో ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సభలు, రోడ్ షో, ర్యాలీలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబరు 1ను విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రోడ్ షోలలో జరిగిన తొక్కిసలాటలో పౌరులు మృతి చెందడంతో ఈ జీవో నెంబరు ఒకటిని ఏపీ ప్రభుత్వం తెచ్చింది.
అభ్యంతరం చెబుతూ...
అయితే దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభ్యంతరం చెబుతూ పిటీషన్ దాఖలు చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ఈ జీవో జారీ చేశారని రామకృష్ణ తరుపున న్యాయవాది వాదించారు. దీనిపై జనవరి 24వ తేదీన హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పు,ను హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈరోజు దీనిపై తీర్పు చెప్పింది. జీవో నెంబరు 1ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై విపక్ష నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.