Pensions : పింఛను పంపిణీ పై హైకోర్టు కీలక ఆదేశాలు
పింఛన్ల పై దాఖలైన పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది.
పింఛన్ల పై దాఖలైన పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. వాలంటీర్లను పింఛన్లు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలయిన పిటీషన్ పై నేడు విచారణ జరిగింది. పింఛను ఇంటివద్ద ఇవ్వకపోవడంతో పింఛను దారులు ఇబ్బందిపడుతున్నారని పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించారు.
డిస్మిస్ చేసి...
దీనివల్ల వృద్ధులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు సచివాలయానికి వెళ్లి పింఛను తీసుకోవాల్సి రావడం కష్టమని వారు వాదించారు. అయితే ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం హైకోర్టు ఈ పిటీషన్ డిస్మిస్ చేసింది. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే నడచుకోవాల్సి ఉంటుందని సూచించింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛను పంపిణీ జరుగుతుందని, అందువల్ల ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.