విశాఖ స్టీల్ ప్లాంట్‌పై స్టేటస్ కో
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గురువారం హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గురువారం హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. 2024 జూన్‌లో కోర్టు తిరిగి ప్రారంభమయ్యే వరకూ వరకు స్టీల్ ప్లాంట్‌ను విక్రయించడం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు.ఈ రోజు యథాతథ స్థితిని పాటించాలని యూనియన్ ఆఫ్ ఇండియాను కోర్టు ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూన్ 19వ తేదీకి వాయిదా వేసింది.
ప్రయివేటీకరించవద్దని...
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చెయ్యనివ్వనంటూ ఆధారాలతో ఇప్పటికే హైకోర్టులో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మినారాయణ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జెడి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిల్‌పై యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ న విక్రయించడం లేదని ప్రభుత్వతరుపున న్యాయవాది చెప్పడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది.