ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ పొడిగింపు
ఎమ్మెల్సీ అనంత బాబుకు తాత్కాలికంగా బెయిల్ ను పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది
ఎమ్మెల్సీ అనంత బాబుకు తాత్కాలికంగా బెయిల్ ను పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. సెప్టంబరు 5 వ తేదీ వరకూ ఆయనకు తాత్కాలిక బెయిల్ లభించింది. రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం మూడు రోజుల పాటు మాత్రమే అనంతబాబుకు బెయిల్ మంజూరు చేసింది. తల్లి మరణంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాజమండ్రి న్యాయస్థానం ఈ బెయిల్ ను మంజూరు చేసింది.
తల్లి మరణంతో...
అయితే రాజమండ్రి న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ పిటీషన్ పై అనంత బాబు హైకోర్టును ఆశ్రయించారు. తన తల్లి దశ దిన కర్మలో పాల్గొనేంత వరకూ అనుమతి ఇవ్వాలని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ ను సెప్టంబరు 5వ తేదీ వరకూ పొడిగించింది. తాత్కాలిక బెయిల్ ను పొడిగిస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.