Breaking : తీర్పు రిజర్వ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు పై నమోదయిన కేసులన్నీ కొట్టివేయాలంటూ ఆయన తరుపున న్యాయవాదులు హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం నుంచి చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై వాదనలు జరిగాయి. చంద్రబాబు తరుపున సిద్ధార్థ లూధ్రాతో పాటు హరీష్ సాల్వేలు వాదించారు. చంద్రబాబుపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమని వాదించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయిన వాదనలు సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగాయి.
ఇరువర్గాల వాదనలు...
అదే సమయంలో సీఐడీ తరుపున కూడా తమ వాదనలను సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వినిపించారు. అన్ని ఆధారాలను సేకరించిన తర్వాతనే రెండేళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరమే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆయన వాదించారు. చంద్రబాబుకు 17ఎ వర్తించదని, ఆయన అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన వాదించారు. రెండేళ్ల పాటు అన్ని సాక్షాలు సేకరించిన తర్వాతనే చంద్రబాబును అరెస్ట్ చేశారని వాదించారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పు ను రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.