టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్ అరెస్ట్

పలాస పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు తన ఇంటికి వెళ్ళే దారిలో పదిహేనేళ్ల క్రితం కల్వర్టు నిర్మించుకున్నాడు

Update: 2023-07-02 03:52 GMT

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ కేంద్రంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు గొడవకు దిగాయి. పట్టణ టిడిపి అధ్యక్షుడు నాగరాజు నివాసంకి వెళ్ళే మార్గంలోని కల్వర్టుని తొలగించేందుకు అధికారులు సిద్దమవ్వటంతో ఉద్రిక్తత నెలకొంది. శనివారం సాయంత్రం నుండి కల్వర్టు వద్ద బైఠాయించి టీడీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. ఆ సమయంలో టీడీపీ ఎంపి రామ్మోహన్ నాయుడు ఘటన స్థలనాకి చేరుకున్నారు. ఆయన్ని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మద్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది.

పలాస పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు తన ఇంటికి వెళ్ళే దారిలో పదిహేనేళ్ల క్రితం కల్వర్టు నిర్మించుకున్నాడు. సాగునీటి కాలువపై నిర్మించిన ఈ కల్వర్టు అక్రమమంటూ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నీటిప్రవాహానికి అడ్డంకిగా మారుతోందంటూ కల్వర్టును కూల్చివేసేందుకు సిద్దమయ్యారు. శనివారం అర్ధరాత్రి కూల్చివేత సామాగ్రితో అధికారులు కల్వర్టు వద్దకు చేరుకున్నారు. వైసీపీ నాయకులు కక్షపూరితంగానే ఇలా చేయిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నాగరాజుకు మద్దతుగా అర్ధరాత్రి ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఎమ్మెల్యే అశోక్, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీష లతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కల్వర్టు కూల్చివేతను అడ్డుకుంటూ రోడ్డుపై బైఠాయించారు. పోలీస్ బలగాలు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అధికారులు, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పలువురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన నియోజకవర్గంలో తాను తిరగకుండా పోలీసులు అడ్డుకోవడం ఏంటని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. పలాసను పాకిస్తాన్ లా తయారు చేశారని మండిపడ్డారు. అర్ధరాత్రి వరకు కల్వర్టు వద్ద హై డ్రామా నెలకొంది. ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్, గౌతు శిరీష లను అదుపులోకి తీసుకుని కల్వర్టును JCB తో తొలగించారు అధికారులు.


Tags:    

Similar News