ప్రకాశం జిల్లాలో హిజాబ్ వివాదం.. విద్యార్థినులను అడ్డుకున్న స్కూల్ యాజమాన్యం
తాజాగా ప్రకాశం జిల్లాలో మరోసారి హిజాబ్ వివాదం రేగింది. యర్రగొండపాలెంలోని ఓ హైస్కూల్ యాజమాన్యం..
దేశంలోని కేరళలో మొదలైన హిజాబ్ వివాదం.. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ను సైతం తాకింది. కొద్దిరోజుల క్రితం విజయవాడలోని లయోలా కాలేజీలో హిజాబ్ వివాదం తెరపైకి వచ్చింది. రోజూ హిజాబ్ ధరించే కాలేజీకి వస్తున్న విద్యార్థినులను అడ్డుకుని, బుర్ఖా ఎందుకు వేసుకుంటున్నారు ? అని కళాశాల ప్రతినిధులు ప్రశ్నించడంతో వివాదం తలెత్తింది. కాసేపటికి ఆ వివాదం సద్దుమణగడంతో.. విద్యార్థినులను కళాశాలలోకి అనుమతించారు.
తాజాగా ప్రకాశం జిల్లాలో మరోసారి హిజాబ్ వివాదం రేగింది. యర్రగొండపాలెంలోని ఓ హైస్కూల్ యాజమాన్యం ముస్లిం విద్యార్థినులను అడ్డుకుంది. హిజాబ్ తొలగించి స్కూల్ కు రావాలని చెప్పడంతో.. విద్యార్థినులు విషయం తల్లిదండ్రులకు చెప్పారు. వారు మత పెద్దలకు తెలుపడంతో.. స్కూల్ వద్ద ముస్లిం మతపెద్దలు ఆందోళనకు దిగారు. ఎప్పట్నుంచో హిజాబ్ ధరించే స్కూల్ కు వస్తున్న తమ పిల్లల్ని.. ఇప్పుడు కొత్తగా హిజాబ్ తీసి రావాలనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మత పెద్దల ఆందోళనతో స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.