త్వరలోనే బండారం బయటపెడతాం
పెగాసస్ వ్యవహారంపై ప్రాధమికంగా చర్చించామని తెలిపారు హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకరెడ్డి తెలిపారు
పెగాసస్ వ్యవహారంపై ప్రాధమికంగా చర్చించామని తెలిపారు హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకరెడ్డి తెలిపారు. పూర్తిగా అప్రజాస్వామిక పోకడకలకు పోయి గత ప్రభుత్వం నిర్వాకంపై రెండు రోజులుగా చర్చ జరిగిందని తెలిపిందారు. గత ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసిందని తమ కమిటీ నమ్ముతుందన్నారు. గోప్యతను, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిందాన్నారు.
రెండు రోజులుగా....
అప్పటి ప్రభుత్వం దొంగతనం చేసిన వ్యవహారాన్ని పూర్తిగా ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. మమత బెనర్జీ చేసిన ఆరోపణలపై కూడా తాము చర్చించామని చెప్పారు. గత రెండు రోజులుగా పెగాసస్ వ్యవహారంపై చర్చించిన కమిటీ త్వరలోనే విషయాలను ప్రజల ముందు ఉంచుతుందన్నారు. జులై 5వ తేదీన మరోసారి కమిటీ సమావేశం అవుతుందన్నారు. పెగాసస్ వ్యవహారంపై స్పీకర్ హౌస్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.