Andhra Pradesh : ఏపీలో జిల్లాలకు కొత్త కలెక్టర్లు వీరే

ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. జిల్లాలకు కలెక్టర్లను నియమించారు

Update: 2024-07-02 12:29 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. జిల్లాలకు కలెక్టర్లను నియమించారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం కలెక్టర్ గా స్విప్నిల్ దినకర్ ను నియమించారు. పార్వతీపురం మన్యం కలెక్టర్ గా శ్యామ్ ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కడప కలెక్టర్ గా...
అనకాపల్లి కలెక్టర్ గా కె విజయను నియమించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా రావిరాల మహేశ్ కుమార్ నియమితులయ్యారు. కడప కలెక్టర్ గా లోతేటి శివశంకర్ ను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ గా అరుణ్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


Tags:    

Similar News