నేను పారిపోను.. దమ్ముంటే నాకు బేడీలెయ్యండి
తాను ఆరోజు అనుకుని ఉంటే జగన్ పాదయాత్ర చేసి ఉండే వాడా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు
తాను ఆరోజు అనుకుని ఉంటే జగన్ పాదయాత్ర చేసి ఉండే వాడా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తన రోడ్ షోలకు జనం తండోపతండాలుగా వస్తున్నారన్నారు. ప్రతిపక్షాల గొంతునొక్కడానికి ఈ చీకటి జీవోను తెచ్చారన్నారు. గత నెలలోనే కు్ప్పంకు వస్తానని చెప్పానని తెలిపారు. ఏ చట్టం కింద తన నియోజకవర్గానికి రానివ్వకుండా చేస్తున్నారని డీజీపీని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రతిపక్ష నేత తిరిగే స్వేచ్ఛ లేదా? అని ఆయన ప్రశ్నించారు. తాను డీజీపీకి ముందుగానే సమాచారం ఇచ్చానని ఆయన తెలిపారు. వైసీపీ సభలకు రాని ప్రజలకు పెన్షన్లను కట్ చేస్తున్నారని ఆరోపించారు.
అనుమతి ఎందుకు ఇవ్వరు?
ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి పారిపోవడం ఖాయమన్నారు. నియంతగా మారిన జగన్ కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. సైకో పాలన పోవాలని, సైకిల్ పాలన రావాలని చంద్రబాబు అన్నారు. ఇది తన నియోజకవర్గమని, తనను ఈ నియోజకవర్గంలో ఎవ్వరూ ఏమీ చేయలేరని అని చంద్రబాబు అన్నారు. రోడ్లపై తాను మాట్లాడకూడదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వానికి టీడీపీ అంటే వణుకుపుడుతుందని అన్నారు. పోలీసులు చట్ట ప్రకారం పని చేయాలని చంద్రబాబు కోరారు. జీవోలతో ఎమెర్జెన్సీని తెస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. డీఎస్పీ వచ్చి లిఖితపూర్వకంగా నోటీసులు ఇచ్చారు. తాను పారిపోయే రకం కాదని అన్నారు. ఎందుకు అనుమతి ఇవ్వరు? అని ప్రశ్నించారు. నాకు బేడీలేయండి. అంతే తప్ప నేను ఇక్కడి నుంచి వదలను అని చంద్రబాబు అన్నారు.