గిరిజన గ్రామాల్లో బాలింత కష్టాలు చూశారా?
అల్లూరి సీతారామ రాజు జిల్లా అడ్డతీగల మండలంలో గిరిజనులు రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు.
గిరిజన గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందలేదు. కనీసం రహదారి సౌకర్యం కూడా లేకపోవడంతో గిరిజనుల అవస్థలు వర్ణనాతీతం. పాలకులు మారినా వీరి జీవితాల్లో మార్పు రాలేదు. రోగం వచ్చినా, రొప్పు వచ్చినా ఆసుపత్రికి వెళ్లాలంటే ఇబ్బందులకు గురి కాక తప్పడం లేదు. పదుల కిలోమీటర్ల నడిచి, వాగులు దాటుతూ ప్రమాదకరమైన పరిస్థిితుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది.
అల్లూరి జిల్లాలో...
తాజాగా అల్లూరి సీతారామ రాజు జిల్లా అడ్డతీగల మండలంలో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. వాగు దాటేందుకు బాలింత అనేక కష్టాలు పడింది. ప్రమాదకర స్థితిలో పసికందు ప్రయాణం చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలింతను ఆసుపత్రికి తీసుకువెళ్ళేందుకు కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడ్డారు. బాలింతను భుజంపై మోసి, పెద్దేరువాగు దాటించాల్సి వచ్చింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.