Free Gas Cylenders : ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే అర్హతలివే

ఆంధ్రప్రదేశ్ లో దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకు అర్హతలు నిర్ణయించారు;

Update: 2024-10-22 05:34 GMT

ఆంధ్రప్రదేశ్ లో దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని గ్యాస్ ఏజెన్సీలతో సమీక్షలు జరిపారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను దీపావళి నుంచి పంపిణీ చేయనున్నారు. దీపావళికి దీపం పథకం కింద ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. నిన్ననే అధికారిక ప్రకటన చేసిన చంద్రబాబు నాయుడు అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటు గ్యాస్ ఏజెన్సీలను కూడా ఆదేశించారు. ఏడాదికి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఈ పథకం కింద ఖర్చవుతుందని అంచనాలను కూడా రూపొందించారు.

దీపం పథకం కింద...
అయితే దీపం పథకం కింద ఆంధ్రప్రదేశ్ లో మహిళలు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పొందాలంటే అందుకు సంబంధించిన అర్హతలు కూడా ఉండాల్సి ఉంటుంది. మహిళందరికీ ఉచిత సిలిండర్లు అందచేయరు. దారిద్ర్యానికి దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ ఉచిత సిలిండర్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఏడాదికి గ్రామాల్లో రెండు లక్షల రూపాయల ఆదాాయం మించకుండా ఉండాలి. పట్టణాల్లో అయితే ఈ పరిమితి మూడు లక్షల వరకూ విధించారు. ఆదాయ పరిమితిని బట్టి మాత్రమే ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుతాయని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అర్హతలివే...
దీంతో పాటు ఆ కుటుంబాలు విధిగా ఆంధ్రప్రదేశ్ లో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాల్సి ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి. ఆర్థికంగా వెనకబడిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. వారే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు లభిస్తాయి. రేషన్ కార్డు ప్రామాణికంగా మాత్రమే తీసుకుని ఈ పథకాన్ని వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీపావళికి ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో దరఖాస్తు చేసుకుని తాము ఈ పథకానికి అర్హులని వారికి వారే పౌరసరఫరాల శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News