నేడు మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక... ఆ రెండింటిలో?
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేడు జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేడు జరగనుంది. ఇటీవల నెల్లూరు కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీలకు ఎన్నిలకు జరిగిన సంగతి తెలిసిందే. ఈరోజు వాటికి సంబంధించి ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్ తో పాటు ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డి పాలెంట, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొంద, కుప్పం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఛైర్మన్ లను, వైస్ ఛైర్మన్లను ఎన్నుకుంటారు.
దర్శి, కొండపల్లిలో....
అయితే దర్శి, కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ఆసక్తికరంగా మారింది. కొండపల్లిలో ఇరవై డివిజన్లుంటే 15 డివిజన్లలో టీడీపీ 14 డివిజన్లలో వైసీపీ గెలిచింది. ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక దర్శిలోనూ ఇరవై వార్డులంటే 13 వార్డుల్లో టీడీపీ, ఏడు వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ కౌన్సిలర్లను ఇప్పటికే క్యాంప్ లకు తరలించారు. వారిని నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఈ రెండు మున్సిపాలిటీల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికలో ఆసక్తి నెలకొంది.