Ap Elections : రెండు కిలోమీటర్ల వరకూ రెడ్ జోన్.. డ్రోన్‌లు ఎగరేసినా చర్యలు

ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంల వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు

Update: 2024-05-21 04:26 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంల వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. వాటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మే 13వ తేదీన పోలింగ్ ముగియడంతో ఆంధ్రప్రదేశ్ లో అనేక చోట్ల ఈవీఎంలను భద్రపర్చారు. అక్కడ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు.

కౌంటింగ్ పూర్తయ్యేంత వరకూ...
వచ్చే నెల 4వ తేదీన కౌంటింగ్ జరిగేంత వరకూ ఈవీఎంలను కాపాడాల్సి ఉంది. అందుకే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈవీఎంలు ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. స్ట్రాంగ్ రూంలు ఉన్న చోట నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకూ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. డ్రోన్లు, బెలూన్లు ఎగరవేయడంపై కూడా నిషేధం విధించారు. నో ఫ్లయింగ్ జోన్ం నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News