ఏపీలో యాభైకే కిలో మటన్... రీజన్ ఇదే
ఆంధ్రప్రదేశ్ లోని వాల్మీకిపురంలో మటన్ కిలో కేవలం యాభై రూపాయలే పలికింది.
ఏ వస్తువుకైనా డిమాండ్ ఉంటే ధర తగ్గుతుంది. అది ప్రాధమిక సూత్రం. కిలో మటన్ 800 రూపాయలు పలుకుతుండగా కేవలం యాభై రూపాయలకే ధర పలకడం ఏపీలో జరిగింది. మాంసం ప్రియులు ఎక్కువగా ఇష్టపడేది మటన్. ఇందుకోసం పోటీ పడుతుంటారు. ఆదివారాల్లో మటన్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని వాల్మీకిపురంలో మటన్ కిలో కేవలం యాభై రూపాయలే పలికింది.
వ్యాపారుల మధ్య పోటీ....
వాల్మీకి పురంలో కిలో మటన్ తొలుత మూడు వందల రూపాయలు పలికింది. అయితే వ్యాపారుల మధ్య పోటీ నెలకొనడంతో ధర కనిష్ట స్థాయికి దిగజారింది. పోటా పోటీగా వ్యాపారులు మటన్ ధరను తగ్గించారు. చివరకు కిలో మటన్ యాభై రూపాయలకే ఒక వ్యాపారి విక్రయించారు. ఇక్కడ కొనుగోలు చేయడానికి ప్రజలు క్యూ కట్టడంతో ఉన్న మటన్ అంతా క్షణాల్లో అమ్ముడు పోయింది. వ్యాపారికి లాభం వచ్చిందా? నష్టం వచ్చిందా? అన్నది పక్కన పెడితే ఆదివారం మటన్ మాత్రం అతి తక్కువ ధరకు దొరికినందుకు ప్రజలు సంతోషపడ్డారు. కిలోల కొద్దీ మటన్ ను కొనుగోలు చేశారు.