బెజవాడలో మంకీపాక్స్ లేదు
విజయవాడలో చిన్నారికి మంకీపాక్స్ లేదని వైద్యులు నిర్ధారించారు. చిన్నారికి జరిపిన వైద్య పరీక్షల్లో ఈ విషయం స్పష్టమైంది,
విజయవాడలో చిన్నారికి మంకీపాక్స్ లేదని వైద్యులు నిర్ధారించారు. చిన్నారికి జరిపిన వైద్య పరీక్షల్లో ఈ విషయం స్పష్టమైంది, దీంతో అందరూ ఊపిరి పీల్చుకుననారు. విజయవాడలో దుబాయ్ నుంచి వచ్చిన కుటుంబంలో ఒక చిన్నారికి మంకీపాక్స్ సోకినట్లు అధికారులు తొలుత అనుమానించారు. చిన్నారి ఒంటిపై దుద్దుర్లు రావడంతో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందింాచరు.
సాధారణ దుద్దుర్లు....
ఆ చిన్నారి కుటుంబం మొత్తాన్ని ఐసొలేషన్ లోకి పంపారు. చిన్నారి నుంచి సేకరించిన రక్త నమూనాలను పరీక్షల కోసం పూణే ల్యాబ్ కు పంపారు. అయితే చిన్నారికి మంకీ పాక్స్ సోకలేదని వైద్యులు తాజాగా ప్రకటించారు. చిన్నారికి జరిపిన వైద్య పరీక్షల్లో మంకీపాక్స్ సోకలేదని వైద్యులు నిర్ధారించారు. నెగిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. బాలికకు వచ్చింది సాధారణ దుద్దుర్లేనని వైద్య పరీక్షల్లో వెల్లడయింది. దీంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు. చిన్నారిని చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేస్తామని విజయవాడ ఆసుప్రతి వైద్యులు తెలిపారు.