YSRCP : కోలా గురువులకు క్యాంప్ కార్యాలయం నుంచి కాల్ వచ్చిందోచ్
విశాఖపట్నంలో వైసీపీ కీలక నేత కోలా గురువులకు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది.;
విశాఖపట్నంలో వైసీపీ కీలక నేత కోలా గురువులకు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఆయనకు అసెంబ్లీ సీటు ఖరారు చేయనున్నారన్న ప్రచారం జరుగుతుంది. కోలా గురువులకు ప్రత్యేకంగా సీఎంవో నుంచి పిలుపు రావడంతో ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పడానికేనన్న ప్రచారం జరుగుతుంది. కోలా గురువులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో ఓటమి పాలయ్యారు.
మరి వాసుపల్లిని....
దీంతో కోలా గురువులకు విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించడానికేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే అక్కడ టీడీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచి వైసీపీ మద్దతుదారుగా ఉన్న వాసుపల్లి గణేశ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయనకు ఎక్కడైనా సీటు ఇస్తారా? లేక కోలా గురువులును మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. 2014లో విశాఖ సౌత్ నుంచే కోలా గురువులు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో ఆయనకు వైసీపీ టిక్కెట్ ఇవ్వలేదు. ఇప్పుడు కోలా గురువులను సీఎంవో పిలవడం వెనక కారణాలు ఏమై ఉంటాయా? అన్న చర్చ జరుగుతుంది.