ఏపీకి పోస్టింగ్ ఇచ్చిన సర్కార్
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా ఆయనను నియమించింది
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా ఆయనను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ శాఖలో ఉన్న విజయకుమార్ కు హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించింది. ఏబీ వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పై సస్సెన్షన్ వేటు వేసింది.
కోర్టు ఉత్తర్వుల మేరకు....
రెండేళ్లు సస్పెండ్ చేసిన తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం తిరిగి ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు తనకు పోస్టింగ్ ఇవ్వాలని, సస్పెన్షన్ కాలంలో జీతం చెల్లించాలని చీఫ్ సెక్రటరీకి నాలుగు లేఖలు రాశారు.