Andhra Pradesh : ఏపీ లో ఐపీఎస్ అధికారుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉతర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉతర్వులను జారీ చేసింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులకు బదిలీ ఉతర్వులు అందాయి. వీరి స్థానంలో కొత్తవారిని నియమించింది. ఏపీఎస్‌పీ బెటాలియన్ అదనపు డీజీగా ఉన్న అతుల్ సింగ్ ను అవినీతి నిరోధక శాఖ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖ సీపీగా...
విశాఖ పోలీస్ కమిషనర్ గా ఉన్న రవిశంకర్ అయ్యన్నార్ ను సీఐడీ అదనపు డీజీగా నియమించింది. లా అండ్ ఆర్డర్ డీజీ శంకబత్ర బాగ్చిని విశాఖపోలీసు కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.