దత్తపుత్రుడికి ఇదే నా సవాల్

ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో పట్టాదార్ పాస్ బుక్ ఉన్న రైతు ఒక్కరైనా ఉన్నారా? అని పవన్ కల్యాణ్ కు జగన్ సవాల్ విసిరారు.

Update: 2022-06-14 06:58 GMT

ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో పట్టాదార్ పాస్ బుక్ ఉన్న రైతు ఒక్కరైనా ఉన్నారా? అని పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి జగన్ సవాల్ విసిరారు. కౌలు రైతులకు రైతు భరోసా కేంద్రంలో సీసీఆర్డీఏ కార్డు ఉందని, ఏడు లక్షల రూపాయల పరిహారం దొరుకుతుందని, వారిలో ఒక్కరినైనా చూపించగలరా జగన్అని ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 438 కుటుంబాలను తమ ప్రభుత్వమే ఆదుకుందన్నారు. చంద్రబాబు హయాంలో రైతు ఆత్మహత్యలు జరిగితే ఆయన దత్తపుత్రుడికి గుర్తు రాలేదన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఈ ప్రభుత్వం 45 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఐదేళ్లలో చంద్రబాబు 32 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో రైతు బీమా విడుదల చేసే కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. హామీల ఇచ్చి మాట తప్పిన వారు రాజకీయాల్లో ఉండాలా? లేదా? అన్నది గుర్తించాలన్నారు. చంద్రబాబుకు ఏం చేస్తే మంచి జరుగుతుందని చెప్పి పరుగులు తీసే దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అన్నారు. వీరిద్దరూ రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా? అని జగన్ ప్రశ్నించారు. రైతులను రెచ్చకొట్టి కోనసీమలో క్రాప్ హాలిడే అని ప్రకటించేలా

నాడు అనంతపురం జిల్లాలో....
అనంతపురం జిల్లా ఒకనాడు కరవు జిల్లాగా ఉండేదని, నేడు నీళ్లతో పల్లెలు కళకళలాడుతున్నాయని జగన్ అన్నారు. అనంతపురం జిల్లాలో మూడేళ్లలోనే 8,885 కోట్ల రూపాయలు వెచ్చించామన్నారు. గతంలో బీమా ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి అని, ఒక సీజన్ లో నష్టం జరిగితే, మరుసటి ఏడాది అదే సీజన్ రాకమునుపే బీమా సొమ్మును అందచేస్తున్నామని జగన్ వివరించారు. ఎక్కడా వివక్ష లేకుండా అర్హులకే అందచేస్తున్నామని చెప్పారు. బీమా లేకపోతే గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో చూశామన్నారు. 2021 ఖకీఫ్ బీమా పంటల పథకం కింద 2,977 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
రైతుల కోసం...
గత తెలుగుదేశం పాలనలో ఐదేళ్లకు కలిపి పంటల బీమా కింద 30,85 లక్షల మంది రైతులకు 3,411 కోట్ల రూపాయలు, ఈరోజు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలోనే 44.25 లక్షల మంది రైతులకు 6,685 కోట్ల రూపాయలు ఇచ్చామని జగన్ వివరించారు. రెండు ప్రభుత్వాల తేడాను గమనించాలని కోరుతున్నానన్నారు. ఐదేళ్లలో గత ప్రభుత్వం రైతుల బీమాను పట్టించుకోవడం లేదన్నారు. బకాయీలు ఎగ్గొట్టారు. ఆ ప్రభుత్వం బకాయీలను కూడా ఈ ప్రభుత్వమే తీర్చిందన్నారు. రైతు భరోసా సొమ్మును ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామన్నారు. ఈ మూడేళ్లలో రైతుల కోసం 1,28 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, మార్పు గమనించమని కోరుతున్నానన్నారు. పార్టీలకతీతంగా రైతులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు.
పదో తరగతి పరీక్షల...
పదోతరగతి పరీక్షలను వీరు రాజకీయం చేస్తున్నారన్నారు. 67 శాతం పాస్ అయ్యారని, గుజరాత్ 65 శాతం మంది ఉత్తీర్ణత అయ్యారన్నారు. ఒక నెలలోపే పరీక్షలు పెట్టి వారిని పాస్ కావాలని ఈ ప్రభుత్వం ఆకాంక్షిస్తే వారిని కూడా కలుషితం చేస్తున్నారన్నారు. ప్రపంచంతో పోటీ పడాల్సిన పిల్లల విషయంలో కూడా రాజీకీయం చేస్తున్నారన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే అక్కడ అల్లర్లు చేయించి, మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను తగులపెట్టారన్నారు. జీర్ణించుకోలేక, కడుపు మంటతో అరాచకాలకు పాల్పడుతున్నారని జగన్ అన్నారు. వీరా సామాజిక న్యాయం చేసేది అని ప్రశ్నించారు. వాళ్లు పెట్టే ఇబ్బందులన్నింటినీ తాను ఎదుర్కొనగలనని అన్నారు.


Tags:    

Similar News