తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తల ప్రత్యేక పూజలు

ప్రతి రాకెట్ ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకుని, రాకెట్ నమూనాను స్వామివారి పాదాల వద్ద ఉంచి

Update: 2022-02-12 10:22 GMT

ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం తిరుమలకు విచ్చేసి.. శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల 14వ తేదీన లాంచ్ చేయనున్న పీఎస్‌ఎల్వీ-సీ 52 ప్రయోగం విజయవంతం కావాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాకెట్ నమూనాను మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు శాస్త్రవేత్తలకు స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందించారు.

కాగా.. ప్రతి రాకెట్ ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకుని, రాకెట్ నమూనాను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అదే పాటిస్తూ.. ఈసారి కూడా పూజలు నిర్వహించారు. శ్రీహరికోట నుంచి ఈనెల 14వ తేదీన ఉదయం 5 గంటల 59 నిమిషాలకు పీఎస్‌ఎల్వీ-సీ 52 నింగిలోకి దూసుకెళ్లనుంది.





Tags:    

Similar News