తిరుమల భక్తులకు శుభవార్త.. రూ145 కోట్లతో మ్యూజియం

తిరుమల తిరుపతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వెంకన్నకు ఎంతో

Update: 2023-08-12 03:50 GMT

తిరుమల తిరుపతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వెంకన్నకు ఎంతో మంది భక్తులు ఉన్నారు. ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. అయితే తిరుమల ఆలయ ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎస్వీ మ్యూజియం ఏర్పాటు సిద్ధమవుతోంది.ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్, మ్యాప్ సిస్టమ్స్ కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియంను ప్రపంచ స్థాయికి చేర్చేందుకు రూ.145 కోట్లను విరాళంగా అందిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్‌ చైర్మన్‌ తిరుపతి ఎమ్మెల్యే బీ కరుణాకరరెడ్డి శుక్రవారం జరిగిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విశాలమైన మ్యూజియాన్ని త్వరలో ప్రపంచ స్థాయి మ్యూజియంగా అభివృద్ధి చేసి సందర్శకులను ఆకట్టుకుంటామని కరుణాకర్ రెడ్డి తెలిపారు. శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని ఆకర్షణీయంగా ప్రదర్శించడంతోపాటు తిరుమల ఆలయానికి సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలతోపాటు చారిత్రక ప్రాధాన్యత, వారసత్వ విశేషాలను యాత్రికులకు తెలియజేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. చైర్మన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ కోసం TCS రూ. 125 కోట్లను విరాళంగా అందిస్తుంది. అలాగే బెంగళూరుకు చెందిన MAP సిస్టమ్స్ రూ. 20 కోట్లను విరాళంగా అందిస్తుంది. డిసెంబర్ నాటికి 19 గ్యాలరీల అభివృద్ధికి నిధులు సమకూరుస్తాయి. మ్యూజియం గ్రౌండ్ ఫ్లోర్‌లో, ఎంఏపీ సిస్టమ్స్ తిరువీధి, ఆలయ అనుభవం, వాహనాలు, సేవాలు, సప్తగిరి 3D అనుభవ గ్యాలరీలను ప్రదర్శిస్తుంది, అయితే టాటా గ్రూప్ ఐటీ బెహెమోత్ వెంకటేశ్వర, పురాతన రాయి, మెటల్, చెక్క శిల్పాలు, అన్నమయ్య రాగి పలకలు, నమిస్మాటిక్‌లను ఫేస్‌లిఫ్ట్ చేస్తుంది. అదే అంతస్తులో గ్యాలరీలు మొదటి అంతస్తులో సంగీత వాయిద్యాలు, పూజా సామాగ్రి గ్యాలరీని ప్రదర్శిస్తారు, రెండవ అంతస్తులో విరాట్‌పురుష్, చతుర్వేద గ్యాలరీలు ఉంటాయి. ఎన్నో దశాబ్దాలుగా తిరుమల ఆలయ శిల్పకళా వైభవం, శ్రీవారి సేవలు, చారిత్రక విషయాలో ఆధ్యాత్మకి వినోదాన్ని అందించేందుకు మ్యూజియాన్ని ఏర్పాటు చేయనుంది తిరుమల తిరుపతి దేశస్థానం. ఈ మ్యూజియంను రూ.145 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజిఎం మూడు ఎకరాల్లో మూడు అంతస్థుల్లో మ్యూజిఎం నిర్మించనున్నారు. ఒక్కో అంతస్థుల్లో ఆసక్తికర మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నారు.

ఈ మ్యూజిఎం డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. మూడు ఎకరాలు, మూడు అంతస్థుల మ్యూజియంలో 19 గ్యాలరీలు ఏర్పాటు చేయనుంది టీటీడీ. మేరకు చేపట్టిన పనులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పూజలు చేసి ప్రారంభించారు. ఇందులో అన్న‌మ‌య్య గ్యాల‌రీ, ధ్యాన‌మందిరం, స్వామివారి ఆభ‌ర‌ణాలు, నాణేలు, పురాత‌న వ‌స్తువులు హోలోగ్రామ్ టెక్నాల‌జీతో ప్ర‌ద‌ర్శించే ఏర్పాటు జరుగుతున్నాయి. అలాగే ఆభ‌ర‌ణాల 3డి ఇమేజింగ్ ద్వారా భ‌క్తులు తాము స్వామివారి నిజ‌మైన ఆభ‌ర‌ణాలు చూస్తున్నామ‌నే అనుభూతి క‌ల్పించాల‌న్న ఆలోచనలో ఉన్న టీటీడీ .. అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. మూడో జోన్‌లో సాక్షాత్తు శ్రీ‌మ‌హావిష్ణువు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌నిపించేలా ఉండబోతోందని తెలుస్తోంది.

Tags:    

Similar News