వాగులో కొట్టుకపోయిన కారు.. ఐదుగురి గల్లంతు
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకూ భానుడి భగభగలతో మండిపోయిన ఏపీలో వర్షాలు కురియడంతో జనాలు కొంత ఊరట కల్గిస్తున్నాయి. ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో సయితం వర్షాలు భారీగానే పడుతున్నాయి.
కర్ణాటకకు చెందిన.....
వర్షాల కారణంగా వాగులు, నదులు ఉప్పంగుతున్నాయి. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తి బెళగల్ సమీపంలో నీటి ఉధృతికి కళ్లివంగలో కారు కొట్టుకు పోయింది. నిన్న రాత్రి భారీ వర్షాలకు కళ్లివంగ వాగు పొంగి ప్రవహిస్తుంది. అయినా కల్వర్టు మీదుగా కారు వెళ్లడంతో కారు కొట్టుకు పోయింది. కర్ణాటకకు చెందిన ఫోర్డు వాహనం వాగులో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఎంతమంది ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు. కారును వెలికితీసేందుకు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కారులో ఐదుగురు ఉన్నట్లు ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.