రాష్ట్రాన్ని ఆదుకోండి... సమస్యలను ఎప్పటిలోగా పరిష‌్కరిస్తారు?

రాష్ట్రాల మధ్వ ఉన్న సమస్యలు నిర్ణీత సమయంలో పరిష్కారమయ్యేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు

Update: 2021-11-14 11:29 GMT

రాష్ట్రాల మధ్వ నెలకొన్న సమస్యలు నిర్ణీత సమయంలోగా పరిష్కారమయ్యేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో జగన్ ప్రారంభోత్సవం మాట్లాడారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2013*14 ధరల ప్రకారం వ్యయాన్ని నిర్ధారించడం రాష్ట్రానికి అన్యాయం చేయడమేనని జగన్ అన్నారు.

ప్రత్యేక హోదా....
ప్రత్యేక హోదాను ఇంతవరకూ ఇవ్వలేదని, ఆ హామీని నెరవేర్చలేదని జగన్ అన్నారు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయీలను ఇప్పించాలని జగన్ కోరారు. దీనివల్ల కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట కలుగుతుందన్నారు. రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా ఇంకా జరగలేదని జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో రుణాల పరిమితి దాటారని ఇప్పుడు కోత విధిస్తున్నారని జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూ లోటు కూడా భర్తీ చేయలేదని జగన్ అన్నారు.
రెవెన్యూ లోటు....
రాష్ట్ర విభజనతో ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని ఇంతవరకూ చేయలేదని జగన్ అన్నారు. ప్రస్తుతం రెవెన్యూ లోటు 22,948 కోట్లు ఆర్థిక లోటు ఉందని జగన్ చెప్పారు. ఏపీలోని వెనకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలను ఈ సమావేశం దృష్టికి జగన్ తీసుకువచ్చారు.


Tags:    

Similar News