నేడు పల్నాడుకు సీఎం జగన్.. విద్యాకానుక కిట్లలో ఏముంటాయంటే?

వైసీపీ ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాదీ జగనన్న విద్యాకానుకను అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో

Update: 2023-06-12 02:11 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం పల్నాడులో పర్యటించనున్నారు. నేడు ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్‌ విద్యాకానుకను ప్రారంభించనున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో సీఎం ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించనున్నారు. బడులు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక ఇవ్వనున్నారు. ఏపీలో ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ వరకు ఒంటి పూట బడి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వైసీపీ ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాదీ జగనన్న విద్యాకానుకను అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే 43,10,165 మంది విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యాకానుక కిట్ల పంపిణీని నేడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రోసూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రతి విద్యార్థికీ దాదాపు రూ.2,400 విలువైన విద్యా కానుక కిట్లను ప్రభుత్వం అందచేస్తోంది. పాఠశాలలు తెరిచిన రోజే 10 వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్‌ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్‌ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)తో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని బడులు తెరిచిన తొలిరోజే చేపట్టనున్నారు. జగనన్న విద్యాకానుక కిట్‌కు క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో సహా నాలుగు దశల్లో నాణ్యతా పరీక్షలు చేపట్టారు.


Tags:    

Similar News