జగన్ ప్రభుత్వాన్ని పాతాళంలోకి తొక్కేద్దాం : పవన్

వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.

Update: 2024-04-25 12:28 GMT

వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటున్నామన్నారు. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉందని, ఇది మారాలని, జగన్ 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారన్నారు. సారా వ్యాపారం చేసుకునే మిథున్‍రెడ్డి నన్ను ఓడిస్తారట అంటూ పవన్ మండిపడ్డారు. పెద్దిరెడ్డి, మిథున్‍రెడ్డి ఎదుర్కొనే గుండెబలం యువతకు లేదా? అని పవన్ కల్యాణ‌్ ప్రశ్నించారు. అన్నమయ్య డ్యామ్ ప్రమాదంలో ఉందని ముందే హెచ్చరించారని, డ్యామ్‍లో ఇసుక తోడేయడం వల్ల 39 మంది చనిపోయారని ఆయన అన్నారు. డ్యామ్‍లు కొట్టుకుపోతున్నా పెద్దిరెడ్డి, మిథున్‍రెడ్డి పట్టించుకోరన్నారు.

సారా వ్యాపారం చేసుకుంటూ...
ప్రశాంతంగా కూర్చుని వాళ్లు మద్యం వ్యాపారం చేసుకుంటున్నారని, సంపదంతా పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు, మిథున్‍రెడ్డి వద్ద ఉందన్నారు. రాజంపేట ప్రాంతానికి పరిశ్రమలను తెచ్చుకోవాల్సి ఉందని, ఇక్కడి ముఠా నేతలు రూ.10 వేల కోట్ల జీఎస్‍టీ ఎగ్గొట్టారన్నారు. ఈ ప్రాంతంలో రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని పెద్దిరెడ్డి తీసుకువచ్చారన్న పవన్ కల్యాణ్ అంగళ్లులో చంద్రబాబుపైనే కేసు పెట్టారన్నారు. హెరిటేజ్‍ను దెబ్బతీయాలని అమూల్‍ను తీసుకొచ్చారని, జగన్‍కు క్లాస్ వార్‍పై మాట్లాడే హక్కు లేదన్న పవన్ కల్యాణ్ యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలని అన్నారు. సోమశిల బ్యాక్ వాటర్స్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.


Tags:    

Similar News