ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన కీలక సమావేశాలు
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది;

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 16,17 తేదీల్లో జనసేన శ్రేణులతో కీలక సమావేశాలు వరసగా జనసేన నిర్వహించాలని నిశ్చయిందచింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన శ్రేణులు కూటమి పార్టీకి అనుకూలంగా పనిచేసేలా వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
ఎంపీలు, ఎంపీలతో...
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు,ఎంపీలు, నేతలతో నాదెండ్ల మనోహర్ సమావేశంకానున్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి ప్రణాళికపై నాదెండ్ల నేతలతో చర్చించనున్నారు. కూటమిలోని మూడు పార్టీలు కలసి కట్టుటా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరనున్నారు.