రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్
జైలు పరిసరాల్లో ఇప్పటికే 144 సెక్షన్ కొనసాగుతోంది. పవన్ రాక నేపథ్యంలో
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సమవేశం అయ్యేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. చంద్రబాబును మంగళవారం ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి కలిశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళుతూ ఉండడం ఆసక్తికరంగా మారనుంది.
జైలు పరిసరాల్లో ఇప్పటికే 144 సెక్షన్ కొనసాగుతోంది. పవన్ రాక నేపథ్యంలో మరింత భద్రతను ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబుకు ఎన్నో విషయాల్లో మద్దతు తెలుపుతూ ఉన్న పవన్ కళ్యాణ్.. భేటీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తూ ఉండడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున పవన్ ప్రభుత్వం కుట్ర పూరిత అరెస్టును ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. కేబినెట్ భేటీలో ఆమోదించి.. చట్టబద్దంగా ఖర్చు పెట్టిన ఓ వ్యవహారంలో ముఖ్యమంత్రిని బాధ్యుడ్ని చేశారని అన్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వారం రోజులకు వాయిదా పడటం.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయకపోవడంతో.. ఆయన జైల్లోనే ఉండనున్నారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.